గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు?... తమిళనాట ఎన్నికల ఫలితాల హోరులో విశాల్ ఆసకిక్తర ట్వీట్

  • తమిళనాడు ఎన్నికల కౌంటింగ్‌లో విజయ్ పార్టీకి అనూహ్య ఫలితాలు
  • ఫలితాల సరళిపై ఆసక్తికర ట్వీట్ చేసిన హీరో విశాల్
  • రాబోయే రోజుల్లో గవర్నర్ యాక్షన్ చూస్తారంటూ వ్యాఖ్య
  • గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసంటూ వ్యంగ్యం
  • ఫలితాల తర్వాత గవర్నర్ పాత్ర కీలకం కానుందన్న సంకేతాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) పార్టీ, పెట్టిన రెండేళ్లకే అద్భుతమైన ఫలితాలతో దూసుకుపోతోంది. ఈ ట్రెండ్స్‌తో విజయ్ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే అంచనాలు వెలువడుతున్న తరుణంలో, కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.

ఫలితాల సరళిపై స్పందిస్తూ విశాల్ తన ట్విట్టర్ ఖాతాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇది తీర్పు వెలువడే రోజు. ఫలితాలు వస్తున్నాయి. ఇందులో అనేక మలుపులు, ట్విస్టులు ఉన్నాయి. ఇంతకీ మన తమిళనాడు గవర్నర్ పేరు ఎంతమందికి తెలుసు? రాబోయే రోజుల్లో ఆయన పూర్తి యాక్షన్‌లో ఉండటం చూస్తారు. ఆయన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఏదైనా రానివ్వండి. తుది ఫలితాల కోసం ఎదురుచూస్తున్నా" అని పోస్ట్ చేశారు. తమిళనాడులో హంగ్ వస్తుందన్న అంచనాల నేపథ్యంలో విశాల్ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికల్లో ఒక పార్టీకి స్పష్టమైన ఆధిక్యం లభిస్తున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, విశాల్ గవర్నర్ పేరును ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటులో ఏమైనా ఊహించని పరిణామాలు చోటుచేసుకుని, గవర్నర్ పాత్ర కీలకం కాబోతోందా అనే కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి, విజయ్ పార్టీ విజయాల వేళ విశాల్ చేసిన ఈ ట్వీట్, తమిళ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. తుది ఫలితాలు వెలువడిన తర్వాతే రాజకీయ ముఖచిత్రంపై పూర్తి స్పష్టత రానుంది.

Vishal
Tamil Nadu Elections
Rajendra Vishwanath Arlekar
Tamil Nadu Governor
Vijay TVK Party
Tamil politics
election results
Tamil Nadu Assembly
Kollywood
Tamilaga Vettri Kazhagam

More Telugu News